వలవేస్తా
ఏటిలో
వలవేస్తా
చేపలను పట్టుకుంటా
బుట్టలో వేసుకుంటా
డబ్బు
వలవేస్తా
పనులు చేయించుకుంటా
పలులాభాలు పొందుతా
చూపుల
వలవెస్తా
చెలిని ఆకట్టుకుంటా
చెలిమి చేసుకుంటా
అందాల
వలవేస్తా
అట్టే ఆకర్షిస్తా
ఆనందాలను అందిస్తా
ఆశల
వలవేస్తా
కోర్కెలను లేపుతా
రంగంలోకి దించుతా
వలపు
వలవేస్తా
వన్నెలాడిని చేబడతా
వివాహము చేసుకుంటా
మాటల
వలవేస్తా
శ్రోతలను పట్టేస్తా
అభిమానులను పెంచుకుంటా
కవితల
వలవేస్తా
పాఠకుల మదులుదోస్తా
అంతరంగాలలో నిలిచిపోతా
వలలో చిక్కితే
వదలకుంటా
వశముచేసుకుంటా
వెంటపెట్టుకుంటా
విముక్తి కావాలంటే
యుక్తిని ప్రయోగిస్తా
శక్తిని చూపిస్తా
విరక్తిని వదిలిస్తా
గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్, భాగ్యనగరం
Comments
Post a Comment