కవితావేశం
మబ్బులు
కమ్ముతుంటే
మదులు
మురిసిపోతాయి
మేఘాలు
చుక్కలుజారుస్తుంటే
కలాలు
అక్షరాలనుకారుస్తాయి
నీరు
భూమిమీదపారుతుంటే
పదాలు
కాగితాలపైప్రవహిస్తాయి
కుంటలు
నిండిపోతే
పుటలు
నిండిపోతాయి
చెరువులు
అలుగులుదాటితే
భావాలు
బయటకొస్తాయి
నదులు
పరుగెత్తుతుంటే
కవితలు
ఉరుకుతాయి
ఆకశము
నీలమయితే
పుస్తకము
నల్లబడుతుంది
ప్రకృతి
పరవశపరుస్తుంటే
సాహితి
సంబరపెడుతుంది
వరదలను
ఆపలేము
కవితలను
కట్టడిచేయలేము
కవితావేశానికి
కాలకట్టుబాట్లులేవు
కవితలనైనాకూర్చాలి
పాటలనైనావ్రాయాలి
గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్,భాగ్యనగరం
Comments
Post a Comment