ఆగు పాఠకా!
కవిత
చదువకుండా
ముందుకు
వెళ్ళకు
శీర్షిక
చూడకుండా
చకచకా
పరుగెత్తకు
అర్ధం
చేసుకోకుండా
నోరును
పారవేసుకోకు
పూర్తిగ
పఠించకుండా
పుక్కిటిపురాణము
చెప్పకు
భావము
తెలుసుకోకుండా
అభిప్రాయము
తెలుపకు
విషయము
విశ్లేషించకుండా
విమర్శలకు
దిగకు
అక్షరవిన్యాసాలు
గమనించకుండా
అమాయకుడవని
అనిపించుకోకు
పదప్రయోగము
పరికించకుండా
వ్యాఖ్యానము
చేయకు
ప్రాసలు
పరిశీలించకుండా
పసందును
పంచలేదనకు
శ్రోతలు
ఎవరూలేకుండా
కూనిరాగాలు
తీయకు
కవిని
తలచుకోకుండా
కైతను
కొనియాడకు
కవిమనసు
కనుక్కోకుండా
కారుకూతలు
కూయకు
లోతులు
చూడకుండా
లోటుపాట్లు
ఎంచకు
కయితలను
స్వాగతించు
కవులను
ప్రోత్సహించు
గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్,భాగ్యనగరం

Comments
Post a Comment