బెజవాడ తెలుగుసంబరాలు
విజయవాడలో నేడు పర్వదినం
తెలుగుభాషకు నిండు నీరాజనం
నినాదం అమ్మభాషను కాపాడుకుందాం
ఆశయం ఆత్మాభిమానం పెంచుకుందాం
వేదికలు బహుసుందరం
వేడుకలు ఆనందకరం
వక్తలు మహామహులు
కవులు కడుప్రసిద్ధులు
పొట్టిశ్రీరాములు సభాప్రాంగణం
ప్రారంభ ఆవరణం యుక్తం
రామోజీరావు వేదికనామం
రమ్యం ప్రశంసనీయం మధురం
వివిధ వేదికాస్థలాలపేర్లు
తెలుగుమహానుభావుల నామధేయాలు
పాల్గొంటున్న యువకవులకు
ఆదర్శవంతులు అమరులు
నిర్వాహకులకు
అభినందనలు
పాల్గొంటున్నవారికి
ధన్యవాదాలు
ఆంధ్రులుగా గర్విద్దాం
తెలుగువాళ్ళగా తృప్తిపడదాం
తెనుగువారిగా సమర్ధిద్దాం
త్రిలింగులగా స్వాగతిద్దాం
గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్, భాగ్యనగరం

Comments
Post a Comment