కవితాస్రవంతి
ఆలోచనలు పారుతుంటే
విషయాలు వెంబడించాలి
భావాలు పుట్టకొస్తే
బయటపెట్టమని పురమాయించాలి
కలము పట్టుకుంటే
అక్షరాలు జాలువారాలి
కాగితం నిండితే
కవిత్వం వెలువడాలి
కవితలు స్రవిస్తుంటే
సాహితీలోకం సుసంపన్నంకావాలి
పాఠకులు చదివితే
హృదయాలు ఉప్పొంగాలి
మనసులు సంతసిస్తే
కవులు స్థిరస్థానంపొందాలి
కవులు వ్రాస్తుండాలి
కైతలు పుడుతుండాలి
కవిత్వం వర్ధిల్లాలి
సాహిత్యం సుభిక్షమవ్వాలి
కవులరాతలు అమృతంచిందాలి
కవిశ్రేష్ఠులు అమరులుకావాలి
గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్, భాగ్యనగరం
Comments
Post a Comment