కవితలతో...


మాధుర్యాలను

పంచుతా

సౌరభాలను

చల్లుతా


పంచభక్ష్యాలు

తినిపిస్తా

నవరసాలు

త్రాగిస్తా


చక్కదనాలు

చూపిస్తా

సంతోషాలు

కలిగిస్తా


కాంతులు

చల్లుతా

కళ్ళను

కట్టేస్తా


కడుపులు

నింపుతా

మదులను

ముట్టుతా


ఆద్యంతం

చదివిస్తా

అమృతం

క్రోలిస్తా


ముచ్చట్లు

కనమంటా

చప్పట్లు

కొట్టిస్తా


శభాష్

అనిపిస్తా

వారేవా

చెప్పిస్తా


తేనెచుక్కలు

చల్లుతా

చెరకురసము

చిమ్ముతా


ఆలోచనలు

లేపుతా

భావాలు

పుట్టిస్తా


అక్షరసేద్యము

చేస్తా

కవనపంటలు

పండిస్తా


కైతలవర్షము

కురిపిస్తా

సాహితీనదులు

ప్రవహింపజేస్తా


అక్షరనౌకను

ఎక్కిస్తా

అంతరిక్షమును

చుట్టిస్తా


కయితలను

స్వాగతిస్తారా

హృదయాలను

ఆనందపరుస్తారా


గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్,భాగ్యనగరం


Comments

Popular posts from this blog