ఓప్రేమికుడి విరహవేదన
నీమనసు
నాదనుకున్నా
నీసొగసు
నాదనుకున్నా
నీతోడు
నేననుకున్నా
నీజోడు
నేననుకున్నా
నీదేహము
నాదనుకున్నా
నీరూపము
నాదనుకున్నా
నీవలపు
నాదనుకున్నా
నీతలపు
నాదనుకున్నా
నీశ్వాస
నాదనుకున్నా
నీధ్యాస
నాదనుకున్నా
నీప్రాణము
నాదనుకున్నా
నీమానము
నాదనుకున్నా
నీనవ్వు
నాకోసమనుకున్నా
నీచూపు
నామీదనుకున్నా
నీహృదయము
నాదనుకున్నా
నీజీవితము
నాదనుకున్నా
మదిని
దోచావు
మోసము
చేశావు
బిచ్చగాడిని
చేశావు
పిచ్చివాడిని
చేశావు
కనబడని
స్థావరానికెళ్ళావు
అందుకోలేని
తీరానికిచేరావు
బ్రతుకుతున్నా
నీకోసము
భరించుతున్నా
నీకోసము
గాలిస్తున్నా
నీకోసము
విలపిస్తున్నా
నీకోసము
ఎక్కడైనా
కలుద్దాము
ఎప్పుడైనా
ఒకటౌదాము
గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్,భాగ్యనగరం

Comments
Post a Comment