అనుభూతులు కవితలువనితలు
తనంతట
తనేరావాలి
కవితయినా
వనితయినా
తొవ్వితే
దొరికేదికాదు కవిత
తన్నితే
వచ్చేదికాదు వనిత
అనుభూతులనే
కవితగామార్చాలి
అనుభుక్తినే
వనితగాతలచాలి
తారలాగా
తళుక్కునతారసపడాలి
మెరుపులాగా
మిలమిలమెరిసిపోవాలి కవిత
అప్సరసలా
అగుపించాలి
రసగుల్లలా
నోరూరించాలి వనిత
తలలోపుట్టి
మదినిముట్టి
భావముకావాలి
బయటకురావాలి కవిత
ప్రేమించి
బంధంకోరి
చెంతకురావాలి
చెలిమిచేయాలి వనిత
తోచిందేతడవుగా
తొందరతొందరగా
అక్షరాలనల్లితే
రసహీనమవుతుంది కవిత
భ్రమల్లోపడి
నిజాలుమరచి
ప్రవర్తించితే
రమ్యహీనమవుతుంది వనిత
అనుభూతినిస్తే
మదినిదోస్తే
మధురమవుతుంది
మెప్పిస్తుంది కవిత
ఇచ్ఛకలిగితే
ఇష్టపడితే
చెంతకొస్తుంది
సుఖమునిస్తుంది వనిత
కవితలు వనితలు
అందాలుచూపుతాయి
ఆనందపరుస్తాయి
అంతరంగాననిలుస్తాయి
కవితలను
ఆస్వాదించండి
కవులను
గుర్తించండి
వనితలను
అభిమానించండి
జీవితాలను
సుఖమయంచేసుకోండి
కవితలు
అనుభూతులు
వనితలు
అనుభుక్తులు
గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్, భాగ్యనగరం
Comments
Post a Comment