ప్రేమగీతాన్నివ్రాసి పాడాలని ఉన్నది
ప్రేమగీతమునొకటి
పాడాలని ఉంది
చక్కనయినచెలిని
పొగడాలని ఉంది ||ప్రేమ||
కళ్ళారా పారజూచి
కాంతులను వెదజల్లి
కెమారాను గురిపెట్టి
అందాలను బంధించాలని ఉంది ||ప్రేమ||
చిరునవ్వుల మోముచూచి
సిగ్గుపడే బుగ్గలుకని
మనసులోని భావాలనెరిగి
చక్కనిఫొటోలు తీయాలని ఉంది ||ప్రేమ||
అమృతంచిందే అధరాలనుచూచి
తేనెచుక్కలుచిందే పలుకులువిని
చేస్తున్న చిలిపిచేష్టలనుకాంచి
విచిత్రచిత్రాలను తీయాలని ఉంది ||ప్రేమ||
ఎగురుతున్న ముంగురులనుచూచి
తొలుగుతున్న పైటకొంగునుకని
దాచలేకున్న కోర్కెలనుతలచి
కాన్వాసుపై కుంచెపట్టిగీయాలని ఉంది ||ప్రేమ||
మన్మధబాణాలువిసిరి మరులురేకెత్తించి
ముగ్గులోనికిదించి ముహూర్తమునుపెట్టించి
మెడనువంచింపజేసి మంగళసూత్రమునుకట్టి
మనుమాడి మంచిగచూచుకోవాలని ఉంది ||ప్రేమ}}
గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్, భాగ్యనగరం
Comments
Post a Comment