అమ్మానాన్నలు
అమ్మానాన్నలు
పటాలకెక్కారు
అనుబంధాలను
మూటకట్టకెళ్ళారు
అమ్మ
చూస్తుంది
అయ్య
పలుకరిస్తున్నాడు
అమ్మ
దీవిస్తుంది
నాన్న
గర్విస్తున్నాడు
అమ్మ
ఆప్యాయతలు పెంచుకోమంటుంది
అయ్య
ఆర్ధికాభివృద్ధిని సాధించుకోమంటున్నాడు
మనుమరాలనుచూచి
అమ్మ సంతసపడుతుంది
మనుమడినిచూచి
అయ్య మురిసిపోతున్నాడు
అమ్మకు
వందనాలు
నాన్నకు
ప్రణామాలు
అమ్మానాన్నలకు
పూదండలు
ధూపదీపాలు
కర్పూరహారతులు
గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్, భాగ్యనగరం
Comments
Post a Comment