కొత్తసాలుకు స్వాగతం


కొత్త వత్సరామొచ్చెను

కొత్త కోర్కెలాలేపెను

డిశెంబరునెలా పోయెను

జనవరిఒకటీ వచ్చెను                ||కొత్త||


కొత్త ఏడుకు  

స్వాగతమూ పలుకుదాం

పాత సాలుకు  

వీడుకోలూ చెప్పుదాం


పాత క్యాలండరును 

తీసివేద్దాం

కొత్తతేదీల పట్టికను 

తగిలిద్దాం                                  ||కొత్త||


తియ్యనీ కేకును 

కోద్దాం

నోర్లలో పెట్టి 

తినిపిద్దాం


ఉత్సాహంగా 

వేడుకా చేసుకుందాం

ఉల్లాసంగా 

సమయమూ గడుపుదాం             ||కొత్త||                            


గత ఙ్ఞాపకాలను 

తలచుకుందాం

మంచీచెడ్డ రెండిటిని 

బేరీజేసుకుందాం


చేసినా తప్పులను 

సరిదిద్దుకుందాం

ఉజ్వలా భవితష్యత్తుకు 

ఉద్యమించుదాం                       ||కొత్త||


నూతన ప్రణాళికను 

రూపొందిద్దాం

ఆశయాల సాధనకు 

కలసిపనిజేద్దాం


నూతన వస్త్రాలను 

వేసుకుందాం

ఆనందంగా మొదటిరోజు 

ప్రారంభిద్దాం                             ||కొత్త||


జ్యోతులను 

వెలిగిద్దాం

చీకట్లను 

తరిమేద్దాం


విఙ్ఞానమును 

వ్యాపిద్దాం

సద్భుద్ధులను 

నేర్పిద్దాం                                   ||కొత్త||                     


మంచితనమును 

చూపుదాం

మానవత్వమును 

చాటుదాం


తియ్యదనాలు 

పంచుదాం

సుఖశాంతులు 

పెంచుదాం                                ||కొత్త||


బంధుమిత్రులను 

కలుద్దాం

కొత్తకానుకలను 

పంచుదాం


చేతులను 

కలుపుదాం


శుభాకాంక్షలు 

తెలుపుదాం                                 ||కొత్త||


గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్, భాగ్యనగరం 


💐💐💐💐🌷🌷🌷🌷 అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు 🌷🌷🌷🌷💐💐💐💐

Comments

Popular posts from this blog