సాహితీ సవ్వడులు


సాహితీచైతన్యం 

స్వాగతిస్తుంది

సాహితీలోకం

సంభాలిస్తుంది


సాహితీసాగరం

దిగమంటుంది

సాహితీప్రస్థానం

సాగించమంటుంది


సాహితీసేవలు 

చేయమంటుంది

సాహితీకిరణాలు

ప్రసరించమంటుంది


సాహితీనౌక

ఎక్కిపయనించమంటుంది

సాహితీసమరం

కొనసాగించమంటుంది


సాహితీవనం

విహరించమంటుంది

సాహితీవలయం

చేబట్టుకుంటుంది


సాహితీసాహచర్యం

వీడొద్దంటుంది

సాహితీసౌరభం

వెదజల్లమంటుంది


సాహితీసమ్మేళనాలు

సందడిచేస్తున్నాయి

సాహితీసంబరాలు

ఆహ్వానంపలుకుతున్నాయి


సాహితీస్ఫూర్తి

ప్రదర్శించమంటుంది

సాహితీశక్టి

చూపించమంటుంది


సాహితీపధం

నడకసాగించమంటుంది

సాహితీగమ్యం

చేరుకోమంటుంది


సాహితీతీర్పులు

శిరసావహిస్తాను

సాహితీమాటలు

చిత్తగించుతాను

 

గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్, భాగ్యనగరం 


Comments

Popular posts from this blog