మహాకవి


అతడు

కోరుకుందెల్లా

లభిస్తుంది

అదృష్టవంతుడు


అతడు

అనుకున్నదెల్లా

జరుగుతుంది

సంకల్పబలుడు


అతడు

పాల్గొన్నవాటిలోనెల్లా

విజయంసాధిస్తాడు

ప్రతిభావంతుడు


అతడు

చిక్కించుకున్నదెల్లా

లాభంచేకూరుస్తుంది

భాగ్యవంతుడు


అతడు

పట్టుకుందల్లా

బంగారమవుతుంది 

హస్తవాసికలవాడు


అతడు

రాయాలనుకున్నప్పుడెల్లా

కమ్మనికవితకూడుతుంది

సరస్వతీపుత్రుడు


అతడు

చదివించినదెల్లా

మనసులుదోస్తుంది

మహాకవివర్యుడు


అతడు

పంపినకైతకు సాహిత్యపోటీలో

ప్రధమస్థానం వస్తుంది

కవిపుంగవుడు


అతడు

అక్షరఙ్ఞాని

సాహిత్యపిపాసి

మహాకవి


గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్,భాగ్యనగరం


Comments

Popular posts from this blog