బాలను నేను
(బాలగీతం)
బాలను నేను
పసిబాలను నేను
చిట్టిని నేను
చిన్నారిని నేను ||బాలను||
తెల్లవారితే
మేల్కొంటా
రాత్రయితే
నిద్దురిస్తా
వెలుతురుంటే
బయటికొస్తా
వెన్నెలుంటే
విహరిస్తా ||బాలను||
ఎక్కిరిస్తే
తెల్లబోతా
ఎత్తుకుంటే
సంతసిస్తా
ఆటలంటే
సయ్యంటా
పాటలంటే
గళమెత్తుతా ||బాలను||
తీపినిస్తే
చప్పరిస్తా
పండునిస్తే
కొరుక్కుతింటా
పప్పులిస్తే
నములుతా
బెల్లమిస్తే
మెక్కుతా ||బాలను||
పూలుయిస్తే
పుచ్చుకుంటా
అత్తరుచల్లితే
ఆఘ్రానిస్తా
కధలుచెబితే
కమ్మగావింటా
కవితపాడితే
కుతూహలపడతా ||బాలను||
చక్కనంటే
చిందులేస్తా
ముద్దులిస్తే
మురిసిపోతా
పిలిచావంటే
పలుకుతా
కబుర్లుచెబితే
కులుకుతా ||బాలను||
గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్, భాగ్యనగరం
Comments
Post a Comment