ఎవరు కవి?


శాలువాలు

కప్పించుకున్నవాడు కవియా!

సత్కవితలు 

రచయించినవాడు కవియా!


పత్రికలు

ప్రాచుర్యమిచ్చినవాడు కవియా!

పాఠకులు

ప్రశంచించినవాడు కవియా!


సొంతడబ్బాలు

కొట్టుకునేవాడు కవియా!

చదువరులు

శ్లాఘించినవాడు కవియా!


బిరుదులు

కొన్నవాడు కవియా!

మనసులు

దోచుకున్నవాడు కవియా!


పేరుప్రఖ్యాతులు

కోరుకునేవాడు కవియా!

పెదవులతేనెచుక్కలు

చిందించేవాడు కవియా!


ఎచ్చులు

హెచ్చుగాచెప్పేవాడు కవియా!

నోర్లయందు

నిత్యమునానువాడు కవియా!


ఎక్కువమాటలువాడి 

తక్కువర్ధమిచ్చేవాడు కవియా!

తక్కువపదాలుప్రయోగించి 

ఎక్కువభావమిచ్చేవాడు కవియా!


అక్షరనిప్పులు

కక్కేవాడు కవియా!

కవనపుష్పాలు

వెదజల్లేవాడు కవియా!


దోషపదాలు

దొర్లించేవాడు కవియా!

కవితాసౌరభాలు

ప్రసరించేవాడు కవియా!


పూర్తిగకాగితాలు

నింపేవాడు కవియా!

కమ్మనికవనాలు

పంచేవాడు కవియా!


పెన్ను

పట్టినవాడు కవియా!

పదాలు

పసందుచేసేవాడు కవియా!


గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్, భాగ్యనగరం 


Comments

Popular posts from this blog