తెలుగుబాటపట్టండి
తెలుగుకు
వెలుగుంది తెరువుంది
రంగుంది హంగుంది
తెలుగుకు
బలముంది భవిష్యత్తుంది
గౌరవముంది గుర్తింపుంది
తెలుగుకు
తీపియుంది తీరువుంది
రుచివుంది శుచివుంది
తెలుగుకు
లయవుంది నడకవుంది
సొగసుంది స్వరముంది
తెలుగుకు
తల్లివుంది అండవుంది
ఖ్యాతివుంది జాతివుంది
తెలుగుకు
వైభవముంది సౌరభముంది
ప్రాబల్యముంది ప్రాముఖ్యముంది
తెలుగుకు
సమయమొచ్చింది సందర్భమొచ్చింది
మెరిపిద్దాంరండి వ్యాపిద్దాంరండి
గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్, భాగ్యనగరం
Comments
Post a Comment