నమ్మకపు మాటలు
తల్లి చెప్పింది
ఎవరినీ నమ్మవద్దని
తండ్రి చెప్పాడు
దేనినీ నమ్మవద్దని
అక్క చెప్పింది
రూమర్లు నమ్మవద్దని
చెల్లి చెప్పింది
గాలిమాటలు నమ్మవద్దని
అన్న చెప్పాడు
కొందరిని నమ్మవద్దని
తమ్ముడు చెప్పాడు
అందరినీ నమ్మవద్దని
అమ్మాయి చెప్పింది
మాయమాటలు నమ్మవద్దని
అబ్బాయి చెప్పాడు
కల్లబొల్లికబుర్లు నమ్మవద్దని
మిత్రుడు చెప్పాడు
కళ్ళనూ నమ్మవద్దని
ఆప్తుడు చెప్పాడు
చెవులనూ నమ్మవద్దని
పెద్దలు చెప్పారు
గుడ్డిగా నమ్మవద్దని
పిల్లలు చెప్పారు
పిచ్చిగా నమ్మవద్దని
మనసు చెప్పింది
కొత్తవారిని నమ్మవద్దని
మెదడు చెప్పింది
పాతవారినీ నమ్మవద్దని
చదువు చెప్పింది
అంతతేలికగా నమ్మవద్దని
సంస్కారం చెప్పింది
తర్కించనిదే నమ్మవద్దని
హృదయం చెప్పింది
సులభంగా నమ్మవద్దని
జీవితం చెప్పింది
తొందరగా నమ్మవద్దని
ఎందరు చెప్పినప్పతికి
నన్ను తప్ప ఎవరినీ నమ్మవద్దని
నిన్ను పూర్తిగా నమ్మాను
అందుకే నేను ఇలాగా తయారయ్యాను
గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్, భాగ్యనగరం
Comments
Post a Comment