నవదంపుతులారా!
తోడునీడగా
బ్రతకండి
వెన్నుదన్నుగా
నిలవండి
ముందువెనుకలు
చూడండి
మంచిబాటను
పట్టండి
అన్యోన్యంగా
ఉండండి
ప్రేమాభిమానాలు
పంచుకోండి
సరసాలు
ఆడుకోండి
విహారాలు
చేయండి
ఉత్సాహంగా
గడపండి
ఉల్లాసంగా
జీవించండి
అందాలను
చూడండి
ఆనందాలను
పొందండి
సంతానమును
కనండి
సద్భుద్దులను
నేర్పండి
పిల్లలను
పోషించండి
ప్రతిభావంతులను
చేయండి
ఆదర్శప్రాయులు
అవండి
అందరిమన్ననలు
అందుకోండి
పేరుప్రఖ్యాతులు
సంపాదించండి
ఆదర్శదంపతులు
అనిపించుకోండి
గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్, భాగ్యనగరం
Comments
Post a Comment