కవితా చైతన్యాలు


ఆవేశము

ఆవరిస్తే

తలపులు

తలనుతడితే

భావాలు

బయటకొస్తే

విషయము

వెల్లడయితే

కవిత పుట్టకొస్తుంది


కరము

కలమును పడితే

అక్షరాలు

అందుబాటుకు వస్తే

పదాలు

ప్రాసలై పొసిగితే

పంక్తులు

చకచకా పరుగెత్తితే

కవిత జనిస్తుంది


కళ్ళు

తెరచుకుంటే

అందాలు

కనబడితే

ఆనందము

కలిగితే

ప్రకృతి

పరవశపరిస్తే

కవిత ఆవిర్భవిస్తుంది


నింగి

నీలమయితే

మేఘాలు

ఆవరిస్తే

చినుకులు

రాలుతుంటే

నీరు

పారుతుంటే

కవిత ఉద్భవిస్తుంది


జాబిలి

తొంగిచూస్తుంటే

వెన్నెల

విరజిమ్ముతుంటే

చల్లదనము

వ్యాపిస్తుంటే

హృదయము

ఉప్పొంగితే

కవిత ప్రభవిస్తుంది


సూరీడు

ఉదయిస్తుంటే

కిరణాలు

ప్రసరిస్తుంటే

అంధకారము

మాయమవుతుంటే

లోకము

మేల్కుంటుంటే

కవిత ఉద్భవిస్తుంది


పువ్వులు

పూస్తుంటే

రంగులు

పులుముకుంటే

రెమ్మలు

విప్పారుతుంటే

పరిమళాలు

చల్లుతుంటే

కవిత తయారవుతుంది


రాత్రి

కలలోకొస్తే

మదిని

కవ్వించితే

హృదిని

ముట్టితే

సాహిత్యంలోనికి

దించితే

కవిత రూపొందుతుంది


పెళ్ళి

జరుగుతుంటే

వాయిద్యాలు

వినబడుతుంటే

తాళి

కడుతుంటే

అక్షింతలు

చల్లుతుంటే

కవిత అవతరిస్తుంది


శారద

కణికరిస్తే

వీణ

మ్రోగుతుంటే

నాదాలు

వినబడుతుంటే

శబ్దాలు

శ్రావ్యమయితే

కవిత ఆవిర్భూతమవుతుంది


గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్, భాగ్యనగరం 


Comments

Popular posts from this blog