మాటలమర్మాలు
మాటలు
గాలిలా
స్పర్శిస్తే
సంతసిస్తా
మాటలు
తేనెచుక్కలు
చల్లితే
ఆస్వాదిస్తా
మాటలు
తూటాలు
ప్రేలిస్తే
తప్పుకుంటా
మాటలు
ప్రేమను
చాటితే
మురిసిపోతా
మాటలు
మంటలను
లేపితే
ఆర్పేస్తా
మాటలు
మల్లెలను
విసిరితే
మత్తులోమునుగుతా
మాటలు
మనసును
దోచుకుంటే
ముగ్ధుడనవుతా
మాటలు
కోటలు
దాటితే
కట్టడిచేస్తా
మాటలు
విషాన్ని
క్రక్కితే
తిరగబడతా
మాటలు
ఆచితూచి
వదిలితే
మెచ్చుకుంటా
మాటలు
మంచివయితే
మదిలో
దాచుకుంటా
మాటలు
కందిరీగలు
అయితే
మట్టుబెడతా
మాటలు
మంత్రాలయితే
స్పష్టంగా
ఉచ్ఛరిస్తా
మాటలు శబ్దాలుకాదు
స్వరాలుకాదు
సందేశాలు
సమాచారాలు
మాటలువిను
వెనకాలకేళ్ళు
మర్మాలను
గ్రహించు
గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్, భాగ్యనగరం
Comments
Post a Comment