నా కవనకహానీలు
కవితను
నడిపిస్తా
కనులారా
కాంచమంటా
కవితను
మొలిపిస్తా
కాయలుకాయిస్తా
కోసుకొనితినమంటా
కవితను
పూయిస్తా
సౌరభాలను
ఆస్వాదించమంటా
కవితను
వెలిగిస్తా
తేరపారా
చూడమంటా
కవితను
వినిపిస్తా
శ్రద్ధగా
ఆలకించమంటా
కవితను
కూరుస్తా
బొమ్మను
చూపుతా
కవితను
వండుతా
కడుపునిండా
ఆరగించమంటా
కవితను
పండిస్తా
కమ్మదనాన్ని
అందిస్తా
కవితను
సాగదీస్తా
ఓపికను
పరీక్షిస్తా
కవితను
కురిపిస్తా
మనసును
తడిపేస్తా
కవితను
చదువుతారా
కవిని
తలుస్తారా
కవితను
గుర్తించుకుంటారా
కవిని
మెచ్చుకుంటారా
గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్, భాగ్యనగరం
Comments
Post a Comment