సా విరహే తవ దీనా!
అడగాలేకానీ
ఏమైనా చేస్తా
కోరాలేకానీ
ఏదైనా ఇస్తా
పిలవాలేకాని
పరుగునవస్తా
చెప్పాలేకాని
చెవులప్పగిస్తా
ప్రక్కకురమ్మంటే
వేంటనేవస్తా
తోడుగానిలవమంటే
నిలచిపోతా
చెప్పింది
చేస్తా
పెట్టింది
తింటా
లెమ్మంటే
లేచినిలబడతా
ఆసీనమాక్రమించమంటే
ఎదురుగాకూర్చుంటా
ప్రేమిస్తే
సంతసిస్తా
ద్వేషిస్తే
భరిస్తా
గొడుకుపట్టమంటే
పడతా
బరువుమోయమంటే
మోస్తా
స్వాతిచినుకుకు
వేచియున్న ముత్యపుచిప్పను
వసంతంకొరకు
కాచుకున్న మల్లెపువ్వును
విరహవేదనపడుతున్న
ఒంటరిపక్షిని
వెన్నెలకెదురుచూస్తున్న
చకోరపక్షిని
కరుణిస్తావో
కాటేస్తావో
కలలోకొస్తావో
కవ్వించుతావో నీ ఇష్టం
గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్, భాగ్యనగరం
Comments
Post a Comment