కవితాప్రియులారా!
మీ పెదవుల
కదలికలు ఊహిస్తున్నా
మీ చదవటాలు
తలచుకుంటున్నా
మీ మాటలు
వినపడినట్లు భావిస్తున్నా
మీ ఆలోచనలు
చెలరేగటం తెలుసుకుంటున్నా
మీ గళాలు
విచ్చుకోవటం వింటున్నా
మీ స్పందనలు
ఎరిగి సంతసిస్తున్నా
మీ మోములవెలుగులు
దర్శించుతున్నా
మీ మదులను
దోచుకోవటం ముఖ్యమనుకుంటున్నా
మీ మెప్పులను
పొందుతూనే ఉండాలనుకుంటున్నా
మీ ప్రోత్సాహానికి
ప్రతిస్పందింస్తుండాలని అనుకుంటున్నా
మీ అభిమానానికి
ధన్యవాదాలు చెబుతూనేయుంటా
మీ కోసమే
కవితాప్రయాణం కొనసాగిస్తుంటా
గుడ్డిగా
రాయకూడదనుకుంటున్నా
పిచ్చిగా
ప్రేలకూడదనుకుంటున్నా
వ్యూహత్మకంగా
అక్షరాలనల్లాలనుకుంటున్నా
పసందుగా
పదాలనుకూర్చాలనుకుంటున్నా
రుచిగా
కవితావంటలు వండాలనుకుంటున్నా
కమ్మగా
కవనవిందులు వడ్డించాలనుకుంటున్నా
గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్, భాగ్యనగరం
Comments
Post a Comment