నీ అందం 


స్వాగతిస్తుంది 

నీ అందం 

చేతులు చాచి


సంతసపరుస్తుంది

నీ అందం 

మనసును తట్టి


కనమంటుంది 

నీ అందం 

కళ్ళను పెద్దవిచేసి


బంధిస్తుంది 

నీ అందం 

చూపును కట్టిపడవేసి


ఆస్వాదించమంటుంది 

నీ అందం 

తీరేదాక దప్పి


నిలుపుకోమంటుంది 

నీ అందం 

నిండేవరకు హృది


గుబులుపుట్టిస్తుంది 

నీ అందం 

గుండెను గుచ్చి


సరసాలాడుతుంది 

నీ అందం 

సయ్యాటలు ఆడమని


మత్తెక్కిస్తుంది 

నీ అందం 

మరులు కొలిపి 


మాయచేస్తుంది 

నీ అందం 

బుట్టలో వేసుకొని 


కాచుకోమంటుంది 

నీ అందం 

పరాయిపాలు చేయవద్దని


కలలోకొస్తుంది 

నీ అందం 

ఎన్నడూ మరచిపోవద్దని


చేబట్టమంటుంది 

నీ అందం 

అవకాశం సద్వినియోగంచేసుకొని 


పిలుస్తుంది 

నీ అందం 

తోడుగా నిలుచుండిపొమ్మని 


ప్రేమించమంటుంది 

నీ అందం 

జాగుచేయకుండా జల్ది


శాశ్వతంచేసుకోమంటుంది 

నీ అందం 

పెద్దలముందు పరిణయమాడి


వర్ణించమంటుంది 

నీ అందం 

విన్నూతనంగా తలచి


వెలిగిపోమ్మంటుంది 

నీ అందం 

విశిష్టకవిగా మారి


పొగడమంటుంది 

నీ అందం 

చూచింది చూచినరీతి


కవ్విస్తుంది 

నీ అందం 

కవితను కమ్మగాకూర్చమని 


గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్, భాగ్యనగరం  


Comments

Popular posts from this blog