దీపంజ్యోతి పరబ్రహ్మం


చీకటి చెడుకు

నివాసస్థలము

చీకటి అఙ్ఞానానికి

ప్రతిబింబము


చీకటి మార్గము

అనర్ధకారకము

చీకటి వ్యవహారము

చెడుకుసంకేతము


చీకటి బ్రతుకులు

వ్యర్ధము

చీకటి పనులు

హేయము


చీకటి రాజ్యము

తొలగించటానికర్హము

చీకటిని తరమటము

తక్షణకర్తవ్యము


చీకటి తస్కరమూకల 

సమయము

చీకటి చాటుమాటుకార్యాల

కాలము


చీకటి దెయ్యలుసంచరించే 

తరుణము

చీకటి రాక్షతత్వానికి

సూచకము


ప్రకాశము

తరిమేస్తుంది అంధకారము

తొలగిస్తుంది అఙ్ఞానము

తప్పిస్తుంది దుష్టత్వము


దీపముతో 

సర్వంసాధ్యము

దీపియతో

శుభంప్రాప్తం 


కిరణాలతో 

కలుగు ఉత్సాహము 

ప్రభలతో 

చర్యలు ప్రారంభము 


వెలుగు

పరబ్రహ్మము

రోచిస్సు

పాపనాశకము


దివ్వెకు

స్వాగతము

దీపికకు

నమస్కారము


గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్, భాగ్యనగరం 



Comments

Popular posts from this blog