ఆలశ్యమయితే అమృతం విషమవుతుందా!
కాయ పండకముందే
నోరూరించటం ఎందుకనో
తక్షణం తినాలనే
కోరికకలగటం ఎందుకనో
వసంతకాలం రాకుండానే
కోకిలకూయలనుకోవటం ఎందుకనో
తరుణం రాకముందే
సవ్వడిచేయటం ఎందుకనో
శరదృతువు రాకముందే
పిండివెన్నెలకురవాలనుకోవటం ఎందుకనో
సమయం రాకముందే
సంబరముచేసుకోవటం ఎందుకనో
శ్రావణముహూర్తము రాకముందే
వివాహమాడాలనులనుకోవటం ఎందుకనో
అందాక వేచియుండకనే
విరహవేదనపడటం ఎందుకనో
మల్లెపూలు విప్పారకముందే
పరిమళాలుచల్లాలనుకోవటం ఎందుకనో
మదినిముట్టి మత్తెంకించే
మోహనరాగాలువినాలనుకోవటం ఎందుకనో
గులాబీలు గుభాలించకముందే
గుబులుపుట్టించటం ఎందుకనో
గుండెలోగుచ్చి గాయపరిస్తే
గందరగోళానికిగురికావటం ఎందుకనో
కలలు కనగానే
బులపాటంకలగటం ఎందుకనో
ఆస్వాదించాలి అనుకోగానే
ఆవేశమావరించటం ఎందుకనో
ఆలశ్యమయితే
అమృతంవిషమవటం ఎందుకనో
అడుగువేయగానే
అన్నీసమకూరాలనుకోవటం ఎందుకనో
గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్, భాగ్యనగరం
Comments
Post a Comment