మనతెలుగు
కర్పూరంలా
హారతులనివ్వాలి
కొవ్వొత్తిలా
కాంతులచిందాలి
సూర్యునిలా
ప్రకాశించాలి
చంద్రునిలా
వెన్నెలచల్లాలి
దీపంలా
ప్రభవించాలి
తారకలా
తళతళలాడాలి
మెరుపులా
వెలుగులుచిమ్మాలి
హరివిల్లులా
రంగులుచూపాలి
శిశువులా
మురిపించాలి
అమ్మలా
లాలించాలి
పువ్వులా
వికసించాలి
నవ్వులా
సంతసపరచాలి
వానలా
చినుకలుచల్లాలి
తేనెలా
పలుకులుచిందాలి
రాస్తే
రమ్యత ఉండాలి
పాడితే
శ్రావ్యత ఉండాలి
కూరిస్తే
లయబద్ధత ఉండాలి
పఠిస్తే
ప్రాముఖ్యత ఉండాలి
తెలుగు
తేటగుండాలి
వెలుగు
చిమ్ముతుండాలి
తెలుగుకు
వందనాలు
తెలుగోళ్ళకు
అభివందనాలు
మనకవులకు
స్వాగతము
మనకవితలకు
ఆగ్రతాంబూలము
గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్, భాగ్యనగరం
Comments
Post a Comment