నా పగటికలలు


నేను మునిగింది 

గంగనుకున్నా

నాకు దక్కింది

మహాపుణ్యమనుకున్నా


నేను పట్టింది

బంగారుమనుకున్నా

నాతలరాత

మారిపోయిందనుకున్నా


నేను ఏరుకున్నది 

నవరత్నాలనుకున్నా

నాకు చిక్కింది

మహాభాగ్యమనుకున్నా


నేను ఇచ్చింది

అమూల్యమనుకున్నా

నేను

మరోబలిచక్రవర్తిననుకున్నా


నేను రాసింది

అపరూపకావ్యమనుకున్నా

నాకు లభించింది

అనన్యసన్మానసత్కారాలనుకున్నా


నేను పాడింది

గాంధర్వగానమనుకున్నా

నాప్రేక్షకులు

అభిమానధనులనుకున్నా


నేను తొటలోపూసిన

తొలిపూవుననుకున్నా

నేనుపిచికారిచేసింది

మల్లెలపరిమళాలనుకున్నా


నేను మేఘమువదిలిన

మొదటివానచుక్కననుకున్నా

నావలన 

భూమిపచ్చబడి హరితవనమయిందనుకున్నా


నేను వలచింది 

రంభనుకున్నా 

నన్ను వరించింది

అదృష్టమనుకున్నా


నేను తలచింది

జరగాలనుకుంటున్నా

నావలన

అందరికీ మేలుజరగాలనుకుంటున్నా


నేను ఎక్కింది

మునగచెట్టనుకుంటున్నారా

కాదు 

నేనధిరోహించిన ఊహలపల్లకిననుకున్నా 


నేను కోసింది

సొరకాయలనుకుంటున్నారా

కాదు

నేనుకన్న పగటికలలనుకుంటున్నా


గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్, భాగ్యనగరం


Comments

Popular posts from this blog