అమ్ముంటేచాలు అదేపదివేలు
ఇంద్రధనస్సు
వద్దు
సప్తవర్ణాలు
వద్దు
సూర్యునికిరణాలు
వద్దు
అరుణోదయము
వద్దు
చంద్రునివెన్నెల
వద్దు
చల్లదనమును
వద్దు
మేఘాల ఉరుములు
వద్దు
మింటిన మెరుపులు
వద్దు
బుగ్గలసిగ్గులు
వద్దు
మోములనవ్వులు
వద్దు
తేనెతీపియు
వద్దు
కోకిలగానము
వద్దు
అమ్మ
చెంతుంటేచాలు
ప్రేమ
కురిపిస్తేచాలు
అమ్మ
తాకితేచాలు
జోలపాట
పాడితేచాలు
అమ్మ
తినిపిస్తేచాలు
కడుపు
నింపితేచాలు
అమ్మ
ప్రక్కనుంటేచాలు
రక్షణ
కలిపిస్తేచాలు అదేపదివేలు
గండ్లపల్లి రాజేంద్రప్రసాద్, భాగ్యనగరం
Comments
Post a Comment