కవితాజల్లులు


విచిత్రాలు

చూపనా

వినోదము

కలిగించనా


విస్మయము

కొల్పనా

వినువీధిన

విహరింపజేయనా


కొత్తదనాలు

కుమ్మరించనా

కమ్మదనాలు

క్రోలమందునా


వయ్యారాలు

వర్ణించనా

సింగారాలు

చూపించనా


మాటలు

చెప్పనా

మనసులు

దోచనా


మల్లెలు

విసరనా

మత్తునందు

ముంచనా


భావాలు

పారించనా

భ్రమలందు

తేలించనా


తేనెబొట్లు

చల్లనా

అమృతచుక్కలు

చిందనా


పువ్వులు

చేతికివ్వనా

నవ్వులు

చిందించనా


కలాలు

కదిలించనా

కవనాలు

సృష్టించనా


కవితలు

చదివించనా

మోములు

వెలిగించనా


అక్షరాలవిందు

ఇవ్వనా

ఆకలిదప్పులు

తీర్చనా


పదాలపరిమళాలు

ప్రసరించనా

పెదాలపలుకులు

పారింపజేయనా


పలుప్రక్రియలు

పరిచయంచేయనా

సాహిత్యమును

పరిచయంచేయనా


కవితాజ్వాలలు

రగిలించనా

కవితాలోకమందు

సంచరింపజేయనా


కవితాజల్లులు

కురిపించనా

కవనప్రవాహమును

కొనసాగించనా


గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్, భాగ్యనగరం 


Comments

Popular posts from this blog