జీవితంలో....
పువ్వులా
బ్రతకాలోయ్
నవ్వులూ
చిందాలోయ్
పొంకాలు
ప్రదర్శించాలోయ్
పరిమళాలు
ప్రసరించాలోయ్
అందాలను
ఆలోకింపచేయాలోయ్
ఆనందాలు
అందేటట్లుచూడాలోయ్
కాంతులు
వెదజల్లాలోయ్
కన్నులు
తెరిపించాలోయ్
సుకుమారంగా
ఉండాలోయ్
సున్నితంగా
మెలగాలోయ్
రమ్యంగా
కనిపించాలోయ్
సౌమ్యంగా
ప్రవర్తించాలోయ్
రంగులు
చూపించాలోయ్
చెంగులు
వేయించాలోయ్
హంగులు
కలిపించాలోయ్
పొంగులు
ప్రదర్శించాలోయ్
సుర్యునిలా
కిరణాలు వెదజల్లాలోయ్
జగతినెల్లా
జాగృతము చేయాలోయ్
చంద్రునిలా
పిండివెన్నెల కురిపించాలోయ్
చల్లదనంతో
ప్రాణుల సంబరపరచాలోయ్
ఉయ్యాల
ఊగాలోయ్
సయ్యాట
ఆడాలోయ్
మకరందము
ముట్టచెప్పాలోయ్
మదులను
మురిపించాలోయ్
పిందెలు
తొడగాలోయ్
ఫలాలు
పండించాలోయ్
ప్రకృతిని
తలపించాలోయ్
పురుషుడిని
పరవశపరచాలోయ్
ఎంతకాలం
బ్రతికావని లెక్కకాదోయ్
ఎంతబాగా
జీవించావనేది ముఖ్యమోయ్
ఏమిచేసినా
ఫలితాలు ఇవ్వాలోయ్
ఎక్కడకేళ్ళినా
గుర్తింపు పొందాలోయ్
గమ్యాలను
చేరుకోవాలోయ్
సుఖాలను
అనుభవించాలోయ్
విజయాలను
అందుకోవాలోయ్
జీవితాలను
సఫలంచేసుకోవాలోయ్
ఆనాడే
బ్రతుకు
అందాలమయము
ఆనందభరితము
అప్పుడే
జీవితము
సార్ధకము
సంపూర్ణము
గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్.భాగ్యనగరం
Comments
Post a Comment