గతఙ్ఞాపకాలు
కొన్ని మరచిపోలేము
కొన్ని గుర్తించుకోలేము
కొన్ని వెంటబడతాయి
కూని చెరిపేసుకొనిపోతాయి
కూని చీకట్లోచూస్తాము
కొన్ని పట్టపగలుదర్శిస్తాము
చీకటిపనులు అదృశ్యమవుతాయి
పగటిదృశ్యాలు కళ్ళలోనిలిచిపోతాయి
కొన్ని తియ్యగుంటాయి
కొన్ని చేదుగుంటాయి
కొన్ని నచ్చుతాయి
కొన్ని వలదంటాయి
కొన్ని వరిస్తాయి
కొన్ని శపిస్తాయి
కొన్ని ప్రేమించమంటాయి
కొన్ని ద్వేషించమంటాయి
కొన్ని సంతసపరుస్తాయి
కొన్ని ఏడిపించుతాయి
కొన్ని గంతులేపిస్తాయి
కొన్ని కన్నీరుకార్పిస్తాయి
కొన్ని చెంతనేవుంటాయి
కొన్ని దూరంగావెళ్తాయి
కొన్ని పొమ్మన్నాపోవు
కొన్ని రమ్మన్నారావు
కొన్ని గతాన్ని తవ్వమంటాయి
కొన్ని బురదలో పూడ్చిపెట్టమంటాయి
కొన్ని కొండశిఖరానికి తెసుకెళతాయి
కొన్ని అధోపాతాళానికి తొక్కేస్తాయి
కొన్ని గాలిలో ఎగిరిస్తాయి
కొన్ని నీటిలో తేలుస్తాయి
కొన్ని ఎత్తునుండి పడవేస్తాయి
కొన్ని అగాధంలో ముంచేస్తాయి
ముగిసిన గతంలో
మార్మికత ఉంటుంది
తెలియని భవిష్యత్తులో
అనిశ్చిత ఉంటుంది
గతము
మరచిపొమ్మంటుంది
భవిత
కలలుకనమంటుంది
గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్, భాగ్యనగరం
Comments
Post a Comment