తల్లుల్లారా....తండ్రుల్లారా....


పాపాయలను వద్దనకండి

పురిటిలోనే చంపేయకండి 

ఆడామగా సమానమనండి 

అబలలంటు అలుసుచేయకండి


బాలికలను ప్రేమించండి 

ఆడామగాభేదము చూపించకండి

మగువను లక్ష్మీదేవియనుకోండి

మహిళను అన్నపూర్ణమాతనుకోండి


అమ్మాయినిపెరటిపువ్వుగా భావించండి 

అందాలగుమ్మగా తీర్చిదిద్దండి 

తరుణులకు విద్యాబుద్ధులునేర్పండి

వినయవిధేయతలు అలవరచండి 


పాపలను అక్కునచేర్చుకోండి

బాలికలపై మక్కువచూపించండి 

ఆడువారిని తక్కువచెయ్యకండి

అభిమానించి ఎక్కువఆదరించండి 


అంగనలను అన్నిటిలోను మిన్నగాచూడండి 

అన్నివేళల్లోను అండగానిలవండి 

సుగుణాలరాశిగా తయారుచేయండి 

శీలవతిగా తీర్చండి పెద్దచేయండి 


భార్యలను

జీవితతోడునీడలనుకోండి

అక్కాచెల్లెల్లను

అనురాగప్రతీకలుగాతలవండి


ఆడది ఆటవస్తువుకాదనిచాటండి 

అతివ అంగడిబొమ్మకాదనిచెప్పండి  

అందానికిప్రతీకలు భామలనండి 

అనురాగానికినెలవు లేమలనండి 


గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్, భాగ్యనగరం



Comments

Popular posts from this blog