కలవరమాయె మదిలో...
ఆమెమోము
ధగధగావెలిగిపోతుంది
పకపకానవ్వులుచిందుతుంది
ఆమెకళ్ళు
కళకళలాడుతున్నాయి
కాంతులుచిమ్ముతున్నాయి
ఆమెరూపము
అందముచూపుతుంది
ఆనందంపొందమంటుంది
ఆమెపలుకులు
తేనెచుక్కలుచిందుతున్నాయి
చెరకురసాన్నితలపిస్తున్నాయి
ఆమెబుగ్గలు
సిగ్గులొలుకుతున్నాయి
ఎర్రబడుతున్నాయి
ఆమెచేతిగాజులు
గలగలమ్రొగుతున్నాయి
గుబులులేపుతున్నాయి
ఆమెకాళ్ళగజ్జెలు
ఘల్లుఘల్లుమంటున్నాయి
హృదిలోసవ్వడిచేస్తున్నాయి
ఆమెనుదుటబొట్టు
వెలిగిపోతుంది
స్వాగతిస్తుంది
ఆమెకాటుకకళ్ళు
తిరుగుతున్నాయి
తొందరపెడుతున్నాయి
ఆమె
వలవిసురుతుంది
మత్తెక్కిస్తుంది
చూపును
ఎలా మరల్చను
కైపును ఎట్లావదిలించుకోను
కోర్కెను
ఏరీతిన తీర్చుకోను
కవ్వింపును ఏవిధానతట్టుకోను
గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్, భాగ్యనగరం

Comments
Post a Comment