కవితలకోసం


కమ్మని కవితను రాయమని

ఎన్ని ఆలోచనలు వెంటబడుతున్నాయో

తియ్యని కవితను కూర్చమని

ఎన్ని భావాలు తలనుతడుతున్నాయో


మంచి కవితను సృష్టించమని

ఎన్ని అక్షరముత్యాలు చెంతకొస్తున్నాయో

గొప్ప కవితను అల్లమని

ఎన్ని పదాలు ప్రాధేయపడుతున్నాయో


కవితాసౌరభాలు వెదజల్లమని

ఎన్ని పూలు ప్రేరేపిస్తున్నాయో

రంగులకవితను రచించమని

ఎన్ని హరివిల్లులు దర్శనమిస్తున్నాయో


ముచ్చటయిన కవితను వెల్లడించమని

ఎన్ని మాటలు మదినిముట్టుతున్నాయో

చక్కని కవితను సమకూర్చమని

ఎన్ని గళాలు కోరుతున్నాయో


కవితలలో వెలుగులు ప్రసరించమని

ఎన్ని దీపాలు వెలిగించమంటున్నాయో

తేటతెలుగు కవితను లిఖించమని

ఎన్ని మాటలు ముందుకొస్తున్నాయో


విడవక కైతలను వ్రాస్తా

వివిధ మాధ్యమాలకు పంపిస్తా

తప్పక కవనాలు అందిస్తా

పాఠకుల మదులలో నిలిచిపోతా


గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్, భాగ్యనగరం  


Comments

Popular posts from this blog