జీవన పయనంలో...
జీవితంలో
ఎన్నో ఏళ్ళు
గడిపావు
ఎన్నో పాఠాలు
నేర్చావు
గతమును
నెమరేసుకో
అనుభవాలను
తలచుకో
లోతుపాతులు
తెలుసుకో
లోటుపాట్లు
సరిదిద్దుకో
మంచీచెడులు
ఆలోచించుకో
విచక్షణను
ఉపయోగించుకో
పూలమార్గాన
నడుచుకో
ముళ్ళదారినడక
మానుకో
లక్ష్యాలను
చేరుకో
జీవితమును
సాఫల్యంచేసుకో
ప్రేమాభిమానాలు
పంచుకో
ఉద్రేకవిద్వేషాలు
తెంచుకో
విజయాలను
అందుకో
వైఫల్యాలను
మరచిపో
పొగడ్తలకు
పొంగకు
తెగడ్తలకు
కృంగకు
పరహితాలకు
పూనుకో
స్వార్ధమును
తగ్గించుకో
గొప్పలు
చెప్పుకోకు
చెత్తను
దాచుకోకు
ఆలోచనతట్టినపుడే
అమలుకుతీసుకోనిర్ణయము
దీపముండగానే
చక్కబెట్టుకోగృహము
గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్, భాగ్యనగరం
Comments
Post a Comment