ఉలిక్కిపడకు....


ఉలిక్కిపడకు 

చెబుతున్నా ఉన్నమాటలు 

త్రుళ్ళిపడకు

తంటాలు తెచ్చుకోకు


మిడిసిపడకు

ముందుంది ముసళ్ళపండుగ

ఎగిసిపడకు

తాడినితన్నితే తలనుతన్నేవాడుంటాడు


తత్తరపడకు 

గత్తరతెచ్చుకోకు 

బిత్తరచూపకు

చిత్తయిపోకు


ఆవేశపడకు

అనర్ధాలు తెచ్చుకోకు 

కృంగిపోకు 

కుతకుతలాడకు 


గంతులేయకు 

గమ్మత్తులుచేయకు 

చిందులేయకు 

చిటపటలాడకు 


భంగపడకు 

జాగ్రత్తగా ప్రవర్తించు 

భయపడకు 

ధైర్యంగా ముందుకెళ్ళు 


అతిగా ఊహించుకోకు 

ఆర్హతనెరిగి అడుగిడు 

అందరినీ నమ్మకు 

బుట్టలో చిక్కకు 


పరుగులు తీయకు 

క్రింద పడకు   

అబద్ధాలు చెప్పకు 

అభాసుపాలు కాకు 


కోతలు కొయ్యకు

నవ్వులపాలు కాకు

గుంటలు తియ్యకు 

గోతుల్లో పడకు 


అశ్రద్ధ వహించకు 

కష్టాలు కొనితెచ్చుకోకు 

అన్నిట్లో జోక్యంచేసుకోకు  

అపనిందలు మూటకట్టుకోకు 


గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్, భాగ్యనగరం  

Comments

Popular posts from this blog