అందాల ఆకాశమా!


నిందిస్తే

ఉరమకు

మెరవకు

భయపెట్టకు


నల్లదానాయంటే

నిరాశచెందకు

కుంభవృష్టి కురిపించకు

ఉపద్రవాలు సృష్టించకు


బాగున్నావంటే

హరివిల్లును చూపకు

వానజల్లులు ఆపకు

కరువుకాటకాలు కలిగించకు


ద్వేషిస్తే

కుప్పకూలకు

ప్రళయాగ్నిరగల్చకు

పుడమినిబూడిదచేయకు


తిడితే

కోపగించకు

నక్షత్రాలు చల్లకు

వడగళ్ళు విసరకు


చెంతకొస్తే

చేరదీయి

సుఖాలనివ్వు

సంతోషపెట్టు


ఔట్లుకాలిస్తే

అదరకు

బెదరకు

ఉలిక్కిపడకు


గాలిపటమెగరేస్తే

తోకనుతెంచకు

దారాన్నికత్తిరించకు

నేలపైకికూల్చకు


ఆకాశమా

భ్రమకొలపకు

మిధ్యననకు

మోసముచేయకు


ఆకాశమా

భూమిని ఢీకొట్టకు

కడలిని పొంగించకు

గాలిని నిలిపేయకు


గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్, భాగ్యనగరం  


Comments

Popular posts from this blog