నువ్వెవరివంటే?


నువ్వు

ఎవరివంటే

నిమిషమాగకుండా

ఇలా జవాబిస్తా


నీపని

ఏమిటంటే

నీళ్ళునమలకుండా

ఇట్లా సమాధానమిస్తా


నేను

వయసు

పెరిగినా

సొగసు

తగ్గనివాడిని


జుట్టు

తెల్లబడినా

పట్టు

సడలనివాడిని


పళ్ళు

రాలినా

ప్రేమ

ఒలికేవాడిని


చూపు

మందగించినా

అందాలు

ఆస్వాదించేవాడిని


కాళ్ళు

తడబడుతున్నా

నడకను

సాగించేవాడిని


దప్పిక

కాకపోయినా

అమృతము

క్రోలేవాడిని


ఆకలి

లేకపోయినా

అందినవన్నీ

ఆరగించేవాడిని


అందం

అందితే

అందరికీ

అందించేవాడిని


అక్షరాలు

అల్లేవాడిని

పదాలు

పేర్చేవాడిని


కవితలు

కూర్చేవాడిని

మనసులు

దోచేవాడిని


గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్, భాగ్యనగరం  

Comments

Popular posts from this blog