మన ఉగాదిముచ్చట్లు
ఉగాది ఆగమనం
తెలుగోళ్ళకు సంతోషం
తెలుగువారి తొలిపండుగ
తెలుగుజాతి పెద్దవేడుక
చైత్రమాసం ఆరంభం
వసంతకాలం ప్రారంభం
ఋతువు మార్పు
కొత్తవత్సరం మొదలు
మల్లెల గుబాళీంపులు, కోకిలల కుహూకుహూలు
పంచాంగ శ్రవణాలు, షడ్రుచుల ఆరగింపులు
కవితల సమ్మేళనాలు, కవులకు సన్మానాలు
శుభాకాంక్షలు చెప్పటాలు, కలసి యుగాదిసంబరాలు
కొత్తబట్టల ధరించటం
గడపలకు తోరణాలుకట్టటం
కొత్తకోడళ్ళు కోడరికానికిరావటం
సలిబిండిపందేరాలు ఉగాదిసంప్రదాయం
గుళ్ళల్లో పూజలు
దేవుళ్ళ ఊరేగింపులు
భాజాభజంత్రీలు భజనలు
కోలాటకోలాహలాలు మధుమాసమాధుర్యాలు
విశ్వావసు ఉగాదికి
ఆహ్వానం పలుకుదాం
నూతన సంవత్సరాన్ని
ఆనందంగా గడుపుకుందాం
గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్, భాగ్యనగరం
🌷🌷🌷💐💐💐అందరికీ ఉగాది శుభాకాంక్షలు💐💐💐🌷🌷🌷
Comments
Post a Comment