ఓ కవీ! ఓసారి ఆలోచించు


ఎవరు చూచేరు

నీ కవితలను

అందులోని

అందాలను


ఎవరు  చదివేరు

నీ కవితలను

పొందేరు

ఆనందాలను


ఎవరు క్రోలేరు

నీ కవితలను

అవి అందించే

మాధుర్యాలను


ఎవరు వినేరు

నీ కవితలను

శ్రోతయై శ్రావ్యతను 

ఆస్వాదించేరు


ఎవరు తలచేరు

నీ కవితలను

అందుకు 

నీవుపడ్డ శ్రమను


ఎవరు మెచ్చేరు

నీ కవితలను

రచనాశైలిని

పదప్రయోగాలను


ఎవరు కోరేరు

నీ కవితలను

పంపమని

ప్రతిరోజు 


ఎవరు ప్రచురించేరు

నీ కవితలను

చేర్చేరు

పాఠకలోకమునకు


ఓ కవీ

రాచేముందు

ఒకసారి

ఆలోచించు


ఓ కవీ

పంపేముందు గుర్తించుకో

సాహితీప్రియుల

అభిలాషలను


గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్, భాగ్యనగరం 

Comments

Popular posts from this blog