వనితలకి వందనాలు


పురుషుడికి

శక్తి ఉన్నది

యుక్తి ఉన్నది


మగవారికి

అందాలు ఉన్నాయి

ఆకర్షణలు ఉన్నాయి


మొగవాళ్ళకి

సద్గుణాలు ఉన్నాయి

సంస్కారాలు ఉన్నాయి


పూరుషులకి

ప్రేమ ఉన్నది

భ్రమ ఉన్నది


మగమహారాజులకి

పౌరుషాలు ఉన్నాయి

పరాక్రమాలు ఉన్నాయి


పురుషజాతికి

తెగువ ఉన్నది

తెలివి ఉన్నది


పుంలింగులకు

సాహసము ఉన్నది

శౌర్యము ఉన్నది


అవన్నీ అమ్మగా అర్ధాంగిగా చెలిగా చెల్లిగా

అక్కగా అంగజగా స్త్రీ మగవారికిచ్చి

ఆఖరికి వారిచేతుల్లో ఆటబొమ్మవుతుంది


స్త్రీమూర్తులు ప్రోత్సాహకులు త్యాగధనులు 

అట్టి స్త్రీజాతి ఔన్నత్యాలకు 

వందనాలు ధన్యవాదాలు


గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్, భాగ్యనగరం 



Comments

Popular posts from this blog