కవిసమ్మేళనాల సంబడము
అదేదో
అరుదైన కవిసమ్మేళనమట
అక్కడెక్కడికో
అరగంటముందే వేదికకుచేరుకోవాలట
కవిత ఇరవైపంక్తులు
మించకూడదట
సమయము రెండునిమిషాలు
దాటకూడదట
అంశమేమో
ఐచ్ఛికమట
ఉపోద్ఘాతాలేవీ
చెప్పకూడదట
చెప్పినవి
వినాలట
చప్పట్లు
కొట్టాలట
పెట్టింది
తినాలట
ప్రశ్నలేవి
అడగకూడదట
కదలకుండా
కూర్చోవాలట
నోరువిప్పకుండా
మూసుకోవాలట
అతిధులను
గౌరవించాలట
సుత్తిచెప్పినా
స్తుతించాలట
నిర్వాహకులను
మెచ్చుకోవాలట
విమర్శలను
సంధించకూడదట
బాగున్నా లేకున్నా
భరించాలట
ఇది మరీబాగుంది
భండారం బయటపెట్టకూడదట
సమ్మేళనాలకు పోకుండుంటే పోలా
సన్మానాలపిచ్చి వదులుకుంటే సరిపోదా
ఇంట్లోకూర్చొని కవితలురాసుకుంటే చాలదా
సాంఘీకమాధ్యమాలకుపంపి సరిపుచ్చుకోవచ్చుకదా
గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్, భాగ్యనగరం
Comments
Post a Comment