మనుజులు మనస్తత్వాలు
మనుషులంతా
ఒకటిగానే ఉంటారు
మనసులు మాత్రం
విభిన్నంగా ఆలోచిస్తుంటాయి
నరులంతా
ఒకేలాగుంటారు
నడవడికలు మాత్రం
విచిత్రంగా ఉంటాయి
మనుజులంతా
మంచివారులా కనపడతారు
కొందరికృత్యాలు మాత్రం
కర్కశంగా ఉంటాయి
మానవులంతా
మస్తిస్కంచెప్పినట్లు వింటారు
మార్చాలని ప్రయత్నించినా
మొండికేస్తారు మిన్నకుంటారు
మర్త్యులంతా
మహనీయులులాగే ఉంటారు
స్వార్ధం కట్టేసినపుడు
సొంతలాభాలు చూచుకుంటారు
మానుషులంతా
ప్రేమకులోలులు
దొరక్కపోతే
ఉగ్రులవుతారు పిచ్చివాళ్ళవుతారు
జనమంతా
అందాలు కోరుకుంటారు
అనుభవించాలని
ఉవ్విళ్ళూరుతుంటారు
జనులంతా
ఆనందపిపాసులే
సంతసాలకోసం
శ్రమిస్తుంటారు ఎదురుచూస్తుంటారు
మనుజుల
పోకడలు
వర్ణనాతీతము
ఊహాతీతము
మనుషుల
మనస్తత్వాలు
చదవటానికి ప్రయత్నించు
మార్చటానికి మార్గాలుకనుగొను
గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్, భాగ్యనగరం
Comments
Post a Comment