ఓ కవీశ్వరా!
వాక్బాణాలు
వదలటం దేనికి?
వీనులకు
విందునివ్వటం దేనికి?
మన్మధబాణాలు
వేయటం దేనికి?
మోహితులను
చేయటం దేనికి?
అక్షరతూణీరాలు
సంధించటం దేనికి?
పంచేంద్రియాలను
పరవశపరచటం దేనికి?
పదాలశరాలు
విడువటం దేనికి?
ప్రాసలప్రయోగాలు
పాటించటం దేనికి?
చూపులవిల్లంబులు
వదులటం దేనికి?
అందాల దృశ్యాలను
వీక్షింపజేయటం దేనికి?
ఆలోచనాస్త్రాలను
ప్రయోగించటం దేనికి?
అంతరంగాలను
తట్టిలేపటం దేనికి?
అస్త్రశస్త్రాలను
ఎక్కుపెట్టటం దేనికి?
అద్భుతకైతలను
అందించటం దేనికి?
వాడియైనశరాలు
వదలటం దేనికి?
చదువరులను
సన్మోహితులనుచేయటం దేనికి?
నీ
సృష్టికి
కష్టానికి
వందనాలు కవీంద్రా!
నీ
ప్రక్రియలకి
ప్రయోగాలకి
పాటవానికి
ప్రణామాలు కవీశ్వరా!
గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్, భాగ్యనగరం
Comments
Post a Comment