మేడే గీతం


వేతనాలకై

వెతలుపడే ఉద్యోగుల్లారా వందనం

పంటలకై

పాటుపడే కర్షకులారా వందనం


బ్రతకటానికై

బాధలుపడే కార్మికులారా వందనం

తిండికై

తిప్పలుపడే దినకూలీల్లారా వందనం     ||వేత||


పెట్టుబడిదారులను

కలసికట్టుగా ఎదిరిద్దాం

గుత్తసంస్థలను

సంఘటితంగా ప్రతిఘటిద్దాం


మధ్యదళారులను

మూకుమ్మడిగా మరుగునపెడదాం

స్వార్ధపరులను

సమయోచితంగా అణచివేద్దాం            ||వేత||


శ్రమశక్తివిలువను

సకలలోకానికి చాటుదాం

చెమటచుక్కలను

సమాజబాగుకి ధారపోద్దాం


దేశాభివృద్ధికొరకు

చేతులుకలిపి ముందుకునడుద్దాం

మే ఒకటవతారీఖును

ఘనంగా కార్మిదినోత్సవంజరుపుకుందాం  ||వేత||  


గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్, భాగ్యనగరం  



Comments

Popular posts from this blog