ఓ కవితా!

(కవనగాలులు)


సుగంధమువై

ప్రసరించవే

పరవశపరచవే


మలయమారుతమువై

మదులనుముట్టవే

మోహములోదించవే


మల్లెలసువాసనవై

మత్తునుచల్లవే

మదినిమురిపించవే


హిమతుషారమువై

శీతలవాతావరణమునివ్వవే

సంతసాలనందించవే


సుడిగాలివై

దుమ్ములేపవే

జోరుగాసాగవే


తేమగాలినై

తనువులపరవశపరచవే

తృప్తినికలిగించవే


ప్రభంజనమువై

ప్రజలనుమేలుకొలుపవే

సాహితీప్రియులనుసంతసపరచవే


అనుకూలపవనమువై

ఆశలుతీర్చవే

అమృతచుక్కలుచల్లవే


పిల్లతెమ్మెరవై

ప్రేమలోనికిదించవే

అనురాగజల్లులుకురిపించవే


వడగాడుపువై

చెమటనుకార్పించవే

శరీరమునుశుద్ధపరచవే


చిరుగాలివై

ఎదగిల్లిచెప్పవే

తీపికబుర్లనందించవే 


కవితాగాలులకు స్వాగతం

కవితలకు ఆహ్వానం

కవులకు ఆమంత్రణం


గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్, భాగ్యనగరం 



Comments

Popular posts from this blog