ఆకాశదేశానా ఆడుతుంటా పాడుతుంటా..


అందకుండా

ఎత్తులోనుంటా

ఆగకుండా

పయనిస్తుంటా


పెక్కురూపాలు

ధరిస్తుంటా

పలురంగులు

చూపిస్తుంటా


పొగలా

తెల్లగుంటా

నింగిలా

నీలంగుంటా


రాయిలా

గట్టిగుంటా

పరుపులా

మెత్తగుంటా


ఢీకొడతా

ఉరుముతుంటా

రాసుకుంటా

మెరుస్తుంటా


దూదిలా

తేలుతుంటా

గుంపులో

తిరుగుతుంటా


కరిగితే

టపటపారాలుతా

చినుకునైతే

చిటపటాకురుస్తా


మేఘమాలనై

దర్శనమిస్తా

రవిచంద్రులనూ

కప్పేస్తుంటా


పుడమిని

తడుపుతుంటా

పంటల్ని

పండిస్తుంటా


నదులు

పారిస్తుంటా 

దప్పికలు

తీరుస్తుంటా


అందాలను

చూపుతుంటా

అంతరంగాలను

తడుతుంటా


రైతులను

మురిపిస్తుంటా

పిల్లలను

ఆడిస్తుంటా


గుండ్లపల్లి రాజేంద్రపసాద్, భాగ్యనగరం 



Comments

Popular posts from this blog