ఓ కవిగారి అంతరంగం


కలలను

కాగితాలకెక్కిస్తే

కల్లబొల్లిమాటలొద్దంటున్నారు


ఆలోచనలకు

అక్షరరూపమిస్తే

అసత్యాలుచెప్పొద్దంటున్నారు


అనుభూతులను

అందంగాకూర్చితే

అర్ధంపర్ధంలేదంటున్నారు


చక్కదనాలను

సవివరంగావర్ణిస్తే

స్వీకరించలేమంటున్నారు


ఆనందాలను

అందిస్తుంటే

ఆస్వాదించలేమంటున్నారు


కలమును

కరానపడితే

కదిలించొద్దంటున్నారు


భావాలను

బయటపెడితే

బడాయిలంటున్నారు


విషయాలను

విశదీకరిస్తే

వద్దుసొల్లుకబుర్లంటున్నారు


సరస్వతిని

ఎలా కొలవను?

సాహిత్యాన్ని

ఎలా వెల్లడించను?


కవితలు

ఎలా వ్రాయను?

కంఠమును

ఎలా విప్పను?


గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్, భాగ్యనగరం  


Comments

Popular posts from this blog