కవితలు
రాస్తే
రమ్యంగా ఉండాలి
పాడితే
శ్రావ్యంగా ఉండాలి
చదివితే
చక్కగా ఉండాలి
వింటే
విలక్షణంగా ఉండాలి
అమరిస్తే
అద్భుతంగా ఉండాలి
అల్లితే
హారంలాగా ఉండాలి
వెల్లడిస్తే
విన్నూతనంగా ఉండాలి
వ్యక్తీకరిస్తే
విభిన్నంగా ఉండాలి
కూర్చితే
కమ్మగా ఉండాలి
పేర్చితే
తియ్యగా ఉండాలి
మదులను
ముట్టేలా ఉండాలి
హృదులను
తట్టేలా ఉండాలి
దోషాలు
దొర్లకుండా ఉండాలి
లోపాలు
లేకుండా ఉండాలి
కవితను
కీర్తించేలా ఉండాలి
కవిని
గుర్తించేలా ఉండాలి
గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్, భాగ్యనగరం
Comments
Post a Comment